Header Banner

వైసీపీకి దిమ్మతిరిగే షాక్! కీలక కార్పొరేటర్లు రాజీనామా.. జనసేనాలో చేరేందుకు సిద్ధం!

  Tue Apr 15, 2025 07:06        Politics

విశాఖపట్నంలో తాజాగా వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు.. ఆ పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. ఆ పార్టీ సీనియర్ నేత బెహరా భాస్కర్ రావుతోపాటు 91వ వార్డు కార్పొరేటర్ జోత్స్న, 92వ వార్డు కార్పొరేటర్ బెహరా వెంకట స్వర్ణలత శివ దేవ రాజీనామా చేశారు. అయితే వీరు మరికొద్ది రోజుల్లో జనసేన పార్టీలో చేరనున్నారు. అందుకు ముహూర్తం సైతం ఖరారు అయినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో వీరు ఆ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. మరోవైపు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ రసవత్తరంగా మారాయి. వైసీపీ నేత, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసు జారీ చేసే నేపధ్యంలో ఇద్దరు వైసీపీకి కార్పొరేటర్లు రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలో ఒకింత విస్మయం వ్యక్తమవుతోంది.


ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!


అదీకాక ఈ అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ 19వ తేదీన జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇంకోవైపు ఇటీవల 74వ డివిజన్ కార్పొరేటర్ వంశీ రెడ్డి సైతం వైసీపీని వీడారు. ఆయన కూడా జనసేన గూటికి చేరతారని తెలుస్తోంది. మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సమయం సమీపిస్తున్న తరుణంలో.. ఇలా ఒక్కొక్కరు వైసీపీని వీడిడం పట్ల ఆ పార్టీ నేతల్లో ఒకింత ఆందోళన రేకెత్తుతోంది. అదీకాక.. మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్దమవుతోన్న తరుణంలో.. తమ కార్పొరేటర్లను రక్షించుకునేందుకు వైసీపీ సిద్దమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా క్యాంప్ రాజకీయాలకు తెర తీసింది. ఆ క్రమంలో పలువురు కార్పొరేటర్లను విదేశాలకు వైసీపీ తరలించిన సంగతి తెలిసిందే. కార్పొరేటర్లు గురించి ఇంత శ్రద్ధ తీసుకున్నా.. ఒకొక్కరిగా ఇలా జారీపోవడం పట్ల జిల్లా వైసీపీ నేతల్లో ఒకంత డీలాపడ్డతోన్న పరిస్థితులు నెలకొంటున్నాయి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #YSRCPShock #JanaSenaRising #PoliticalShakeup #VisakhapatnamPolitics #CorporatorsResign